సీఎంను కట్టేసి కొడుతాం
తెలంగాణ సీఎం కేసీఆర్పై మండిపడ్డారు తీన్మార్ మల్లన్న. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేస విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తను ఇచ్చిన సభ్యత్వం ఓ తాడని… దీనితో కల్వకుంట్ల కుటుంబాన్ని అమరవీరుల స్థూపానికి కట్టిపడేస్తానని అన్నారు. అంతేకాకుండా అమరవీరుల కుటుంబాలతో కలిసి వారి బరతం పడుతాం అని తెలిపారు. ఓ నియంత తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. ఆయనని గద్దె దింపడమే లక్ష్యమన్నారు.