భారత్లో 12 ఒమిక్రాన్ కేసులు
భారత్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సౌత్ ఆఫ్రికాలో మొదలైన ఈ కొత్త వైరస్ ఇప్పటి ప్రపంచ దేశాలను చుట్టేసింది. మన దేశంలోని మహారాష్ట్రలో ఒకేసారి 7 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 8కి చేరింది. దేశంలో తొలిసారిగా కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసింది. బెంగళూరులో 2 కేసులు వెల్లడయ్యాయి. అటు గుజరాత్లో 1, ఢిల్లీలో 1 కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 12కి పెరిగింది.