బిగ్బాస్ షోతో మళ్లీ తెలంగాణ చిచ్చు రాజేస్తున్నారా ?
తెలంగాణ ఓ ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ ఉద్యమం. ఎన్నో పోరాటాలకు ఆదర్శం. ఏ ఒక్కరిని కదిపిన ఉవ్వేత్తున ఎగిసిన పడిన మానోవేధన. వందల మంది బిడ్డల ఆత్మబలిదానం. ఇలా ఎన్నో కలగలిపిన మహా ఉద్యమమే తెలంగాణ.
కానీ నేడు ఓ స్వార్థ రాజకీయాలకు వేదికైతుంది అనడంలో అతియోశక్తి లేదు. తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని ఓ అంశంపై మళ్లీ తెలంగాణ చిచ్చు పెడుతున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల్లో స్తభత్త నెలకొంది. భారతీయ జనతా పార్టీతో యుద్దం చేస్తానని శపధం చేసినంతా పని చేశారు. ఆ కోవలోకి బిగ్బాస్ షోని లాగుతున్నట్లు అర్ధమవుతోంది.
నిజానికి బిగ్బాస్ షోకి, తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు… అయినా కానీ ఆ షో తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి (యాంకర్ రవి) పాల్గొన్నారు. నిన్న అతన్ని ఆ బిగ్ బాస్ షో నుండి ఎలిమినెట్ చేశారు. అయితే ఇదే పావుగా వాడుకోవాలనే ఉద్దేశ్యంతో వెంటనే రంగంలోకి దిగిన తెలంగాణ జాగృతి నేతలు.. అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్యాయం జరిగిందని. ఇందులో ఏమాత్రం యాంకర్ రవికి, తెలంగాణ ఉద్యమం, ప్రాంతానికి ఏమైన సంబంధం ఉందా ?.
తెలంగాణ జరుగుతున్న తప్పులను కప్పి ఉంచడానికి కేంద్రం మీద యుద్ధం చేయడానికి, మరోమారు ప్రాంతీయ వాదాన్ని తెర మీదకు తీసుకురావడానికి సన్నాహాల్లో భాగంగా ఇది చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.