హైదరాబాద్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులు కరోనా బారినపడ్డారు. బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ విద్యా సంస్థకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. బాధితులను హోమ్ క్వారైంటన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కోవిడ్ భయంతో వర్సిటీలోని హాస్టల్స్‌ను విద్యార్థులు ఖాళీ చేశారు. వీరంతా యూనివర్సిటీ బయట పెద్ద సంఖ్యలో గూమిగూడటంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో, దుండిగల్ పీహెచ్‌సీ వైద్యాధికారి నిర్మల నిర్ధారించారు. ఎంతమంది విద్యార్థులకు కరోనా సోకిందనేది స్పష్టత లేదు. అయితే, క్యాంపస్ మొత్తం శానిటైజేషన్ చేసిన తర్వాతే మళ్లీ క్లాసులు మొదలవుతాయని యాజమాన్యం పేర్కొంది.
కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ విద్యార్థులంతా పాల్గొన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట క్యాంపస్‌లో ఫ్రెషర్స్ డే నిర్వహించారని, ఆ సమయంలో వీరికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు, తెలంగాణలో కొత్తగా 171 కొవిడ్ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 6,75,319కి చేరింది.