భార‌త్‌లో పుతిన్ ప‌ర్య‌ట‌న‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు 6న ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియా, రష్యా మధ్య జరిగే 21వ యాన్యువల్ సమ్మిట్ కోసం ఆయన ఇక్కడికి రానున్నారు. ఈ సమ్మిట్ చివరిసారి 2019లో జరిగింది. కరోనా కారణంగా నిరుడు నిర్వహించలేదు. సదస్సులో భాగంగా ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్​ ఇరు దేశాల రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమ్మిట్​కు ముందు రెండు దేశాల మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధ్య 2+2 డైలాగ్ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రుగుతుంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విదేశాంగ శాఖ తెలిపింది. రెండు దేశాలకు చెందిన ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షణ, విదేశాంగ శాఖ మంత్రులు ఈ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మావేశంలో పాల్గొననున్నారు.