బంజారాహిల్స్‌లోని మ‌సాజ్ సెంట‌ర్ల‌పై పోలీసుల దాడులు

హైదరాబాద్ లో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెంటర్ మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో కొందరు ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ కేంద్రాల్లో మసాజ్ పేరిట వ్య‌భిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. ఈ క్రమంలో మసాజ్ సెంటర్ నిర్వాహకలుతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు.