హుజురాబాద్‌లో తెరాస 600 కోట్లు ఖర్చు పెట్టింది : ఈటల
రాజకీయాల ఊహకు అందని విధంగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి, ఈటల రాజేందర్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈటల చేత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో హక్కులు ఉండేవని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు గౌరవం లేదని తెలిపారు. తనను అకారణంగా మంత్రి వర్గం నుంచి తొలగించారని మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత.. మీడియా పాయింట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ రూ. 600 కోట్టు ఖర్చు పెట్టిందని అన్నారు.