హుజురాబాద్‌లో భాజ‌పా గెలుపు ధ‌రిప‌ల్లిలో సంబురాలు

హుజురాబాద్‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య‌కేత‌నం ఏగ‌ర‌వేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట మండ‌లం ధ‌రిప‌ల్లి భార‌తీయ జన‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ట‌పాసులు కాల్చి ఆనందం వ్య‌క్తం చేశారు. అధికార పార్టీ ఎన్ని ప్ర‌లోభాలు పెట్టినా… ప్ర‌జ‌లు న్యాయం వైపు మొగ్గు చూపార‌ని అన్నారు పార్టీ నాయ‌కుడు వీరయ్య‌గారి అంజిరెడ్డి. భ‌విష్య‌త్తులో జ‌రిగే అన్ని ఎన్నిక‌ల్లో భాజ‌పా జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. హుజురాబాద్ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ద‌ళిత‌బంధు ప్ర‌వేశ పెట్టి ఆశ చూపిన ఓట‌ర్లు కాషాయానికే ప‌ట్టం క‌ట్టారాని అన్నారు మ‌రో పార్టీ కార్య‌క‌ర్త మ‌హేష్‌. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు గోద‌ల శ్రీ‌నివాస్ రెడ్డి, దొమ్మాట రామిరెడ్డి, స్వామి, ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.