ఏపీని తెలంగాణ‌లో క‌లిపేయండి : మంత్రి పేర్నినాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్ల‌పై మంత్రి త‌నదైన శైలిలో స్పందించారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలా అని చమత్కరించారు. కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటుమ‌న్నారు.
‘‘ఏపీలో పార్టీ పెట్టడానికంటే ముందు కేసీఆర్‌ తెలంగాణ కేబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్నిపెడితే బాగుంటుంది. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ, తెలంగాణలు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారు’’ అన్నారు.