రేంవత్‌పై పరుషపదజాలం వాడిన మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో కీలకమయ్యారు. ఇప్పటికే తన పదజాలంతో అప్పుడప్పుడు వార్తల్లో ఉండే ఆయన, ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్‌పై తన పరుషపదజాలన్ని ఉపయోగించారు. బస్తీమే సవాలు అంటూ తొడకొట్టారు. వివరాల్లోకి వెళ్తే… సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధిని చూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ రేవంత్ రెడ్డి నిన్న సవాల్ విసిరారు. 24 గంటలు గడిచినా తన సవాల్ కు అధికారపక్షం నుంచి ఒక్కరు కూడా స్పందించలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి మరీ స్పందించారు. తాను రాజీనామా చేసి వస్తానని, రేవంత్ కూడా రాజీనామా చేసి రావాలని సవాల్ విసిరారు. గెలిచినవాడు హీరో, ఓడినవాడు జీరో అని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.