గోకూప్ చేనేత ప్రదర్శనకు భారీ స్పందన
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన గోకూప్ చేనేత ప్రదర్శనకు విశేష స్పందన వచ్చింది. కరోనా మహమ్మారి వల్ల కుంటుబడ్డ చేనేత పరిశ్రమను ఆదుకోవడమే తమ లక్ష్యమని గోకూప్ సేల్స్ & మార్కేటింగ్ జనరల్ మేనేజర్ మాధవి నాయుడు తెలిపారు. బంజారాహిల్స్‌లోని కళింగ హాల్లో గత మూడు రోజుల క్రితం ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శకు విశేష స్పందన వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా హైదరబాదిలు ఇష్టపడే చేనేత వస్త్రాలను సేకరిస్తామని పేర్కొన్నారు. చేనేత దినోత్సవం రోజున ప్రజలు ఎక్కువ మంది చేనేత వస్త్రాలు కొనుగొలు చేశారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి చేనేత వస్తువులు, వస్త్రాలు వచ్చాయని అన్నారు.