మాయ‌ని మ‌చ్చ మాసాయిపేట ఘ‌ట‌న‌

జీవితంలో మ‌రిచిపోలేని మాయ‌ని మ‌చ్చ ఆ ప్ర‌మాదం. బిడ్డ‌ల‌ను చ‌క్క‌గా బ‌డికి పంపితే మృతువు ఒడిలోకి వెళ్లారాని కుమిలి కుమిలి ఏడ్చుతున్నఆ త‌ల్లిదండ్రుల కంటిలో క‌న్నీళ్లు ఇంకిపోవ‌డం లేదు. మెద‌క్ జిల్లా మాసాయిపేటలో 2014 జూలై 24న జ‌రిగిన రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దేశంలోనే సంచ‌ల‌నంగా మారింది. ప్రమాదం జరిగి నేటికి ఏడేళ్లు గడిచాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌మాదం జ‌రిగిన రైల్వే గేట్ వ‌ద్ద చ‌నిపోయిన చిన్నారుల త‌ల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు నివాళ్లు అర్పించారు. వారిని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి శిక్ష ఎవ్వ‌ర‌కి వేయ‌కూడ‌ద‌ని ఆ భ‌గ‌వంతున్ని కోరారు.