కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వస్తున్న మంచి పేరును కేసీఆర్ జీర్ణించుకోలేపోయాడు. అందుకే నాపై కుట్రలు చేశారన్నారు. హుజురాబాద్లో చేపట్టిన ప్రజాదీవెన పాదయాత్రలో భాగంగా ఇల్లందకుంటలో ఈటల మాట్లాడారు. హుజురాబాద్ నియోజవర్గ ప్రజలు తనను కడుపులో పెట్టుకోని చూసుకున్నారని తెలిపారు. ఆరుసార్లు ధర్మంగా గెలిచనని తెలిపారు. కరోనాటైంలో ముందుండి వైద్యారోగ్యశాఖను నడిపించిన తనపై కుట్రపన్ని పదవినుంచి తొలగించారన్నారు. తాను కరోనా సమయంలో పనిలో ఉంటే.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని తనకు పేరు రావడం జీర్ణించుకోలేకపోయాడన్నారు. ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా తనకు మంచి పేరొస్తోందని కుట్ర పన్ని పథకం రచించాడని. అందుకే కొంతమందికి డబ్బులిచ్చి దరఖాస్తు తీసుకుని మంత్రి వర్గం నుంచి తీసేశారన్నారు. తాను కేసీఆర్ బొమ్మతో గెలిచానని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని..మరి కేసీఆర్ తన బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో లేచినోడు, లేవనోడు.. తన మీద అవాకులు, చెవాకులు మాట్లాడారన్నారు. సొంతపార్టీ నాయకులనే అంగట్లో పశువుల్లాగా డబ్బు సంచులు పెట్టి కొనుగోలు చేసారన్నారు. తనతో పాటు మిగిలివాళ్లే నిఖార్సైన బిడ్డలన్నారు ఈటల.