ఒలంపిక్స్‌లో తొలి స్వర్ణం చైనాకే
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒలంపిక్స్‌లో స్వర్ణ పథకాల పంట పడింది. ఈ క్రీడల్లో పాల్గొన్న చైనా మొదటి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో చైనా షూటర్ యాంగ్ కియాన్ విజయం సాధించింది. రష్యన్ షూటర్ గలాషినా అనస్టాసియాను స్వల్ప తేడాతో ఆమె ఓడించింది. వీరిద్దరి మధ్య పోరు నువ్వా? నేనా? అన్నట్టుగా సాగింది. ఇద్దరి మధ్య పోరు 125.6-126.0, 147.3-146.2, 168.3-167.6, 188.9-189.1, 210.0-210.5, 231.3-231.4తో సాగింది. స్విట్జర్లాండ్ కు చెందిన క్రిస్టినా నీనా 230.6 పాయింట్లతో కాంస్య పతకం సాధించింది.