హుజురాబాద్లో ఎగిరేది కమలం జెండానే – అరుణ
మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వస్తుందన్నారు సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణ. అధికార పార్టీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన ప్రజల నుండి వచ్చే ప్రేమ, ఆప్యాయతను అడ్డుకోలేరన్నారు. హుజురాబాద్లో ఈటల న్యాయకత్వాన్నే మరోమారు కోరుంటున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ అవినీతిని బట్టబయలు చేసేది ఒక్క బీజేపీ నేనని అన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వార్షాలను సైతం లెక్కజేయకుండా ఈటల పాదయాత్ర కొనసాగుతుందన్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో దుబ్బాకలో వచ్చిన ఫలితమే ఇక్కడ కూడా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కావాలని అధికార పార్టీ తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు.