యాద్రదిలో విరిగిపడ్డ కొండచరియలు
తెలంగాణలో వర్షాలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వానాలకు యాద్రాదిలోని రెండో ఘాట్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో రెండో ఘాట్ రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు. యాదాద్రిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా కొండపైన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గుట్టను బ్లాస్ట్ చేసి కొత్త రోడ్డును నిర్మించారు. మరోవైపు నాణ్యత ప్రమాణాలను సరిగా పాటించకపోవడంతో పాటు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై కొండ చరియలు విరిగిపడుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.