ఈట‌ల ఉగ్ర‌రూపం – తొక్కుతా బిడ్డా

హుజురాబాద్‌లో జ‌రుగుతున్న తీరుపై మండిప‌డ్డారు మాజీ మంత్రి, భాజ‌పా నాయ‌కులు ఈట‌ల రాజేంద‌ర్‌. త‌న పాద‌యాత్ర‌లో పోలీసులు అడుగ‌డునా… అడ్డుకుంటున్నార‌ని, త‌మ‌కి మ‌ద్ద‌తు తెల‌పిన వారిని బెదిరిస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌న దైన శైలిలో ఎవ‌డ్రా మీరు తొక్కుతా బిడ్డా అంటూ అగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. భోజ‌నాల‌కు అనుమ‌తి ఇచ్చిన రైస్‌మిల్లు వారిని పోలీసులు బెదిరించ‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయం అని ప్ర‌శ్నించారు. పోలీసుల‌కు ఉద్యోగాల‌కు చేయ‌చేతాక‌క‌పోతే గులాబీ కండువా క‌ప్పుకొని రావాల‌న్నారు. అంతేకానీ ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి దిగ‌జారుడు ప‌నులేంటని అన్నారు.