విడాకుల కోసం వస్తే నగ్నంగా ఫోటోలు తీసి అత్యాచారం
భర్తతో వచ్చిన విభేదాలతో కోర్ట్ మొట్లు ఎక్కింది ఓ మహిళ. ఇందుకోసం ఓ న్యాయవాది కలిసి తనకు ఎలాగైన విడాకులు ఇప్పించాలని కోరింది. ఇదే అదునుగా చేసుకున్న ఆ నల్లకోటు వేసుకున్న కామాపిచాచి బాధితురాలి జీవితాన్ని నాశనం చేశారు. సాయం కోరి వస్తే శీతలపానీయంలో మత్తుమందు కలిని, సృహ తప్పిన తర్వాత నగ్నంగా ఫోటోలు తీసి, ఆపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా డబ్బులు కావాలని డిమాండ్ చేసి 7 లక్షల రూపాయల వరకు వసూలు చేసుకున్నాడు. తమిళనాడులోని తిరువళ్లూర్ సమీపంలోని మనవాళనగర్‌కు చెందిన వివాహిత విడాకులు తీసుకోవడానికి తిరువళ్లూరు జిల్లా కోర్టులో పనిచేస్తున్న న్యాయవాది డార్జన్ (44)ని కలిశారు. మరింత నగదు కావాలని డిమాండ్ చేయడంతో బాధితురాలు కోర్టుకు వెళ్లడంతో న్యాయవాది చీకటి బాగోతం బయటపడింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.