మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 23వ తేదీన బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బుధవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. నేడు ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.