హుజురాబాద్‌లో భాజపాదే గెలుపు : జ‌య‌శ్రీ‌

త్వ‌ర‌లో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భాజపానే విజ‌య సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు క‌రీంన‌గ‌ర్ జిల్లా పార్టీ మ‌హిళామోర్చా అధ్య‌క్షురాలు జ‌య‌శ్రీ‌. ఈ మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఈటల చేప్ప‌ట్టిన పాద‌యాత్ర‌కు ఆమె మ‌ద్ద‌తు తెలిపారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకోవ‌డానికే ఈట‌ల రాజేంద‌ర్ పాద‌యాత్ర చేప‌ట్టార‌ని అన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్ర‌లు చేసినా… త‌మ గెలుపు త‌ధ్య‌మ‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో జ‌రిగే ఈ ఎన్నిక‌లకు న్యాయానికే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతార‌ని తెలిపారు. అంతేకానీ అహంకారంతో మాట్లాడుతున్న వారికి ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెబుతార‌ని వ్యాఖ్యానించారు.