మా అత్తకు అద్దె బాయ్ ఫ్రెండ్ కావాలి, 72 వేలు ఇస్తా కోడలు ట్వీట్
ఈ పదం వినడానికి వింతగానే ఉన్నా… ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త చక్కర్లు కొడుతుంది. మా అత్తకు అద్దె బాయ్‌ఫ్రెండ్ కావాలని ఓ కోడలు ట్వీటర్‌లో పోస్ట్ చేసింది. చూసింది తడువుగా నెటిజన్లు
ఈ వార్తను పుల్ వైరల్‌గా మార్చారు.
అద్దెకు వస్తే అంత ఇంత కాదు. ఏకంగా మన ఇండియా రూపాయల్లో 72 వేలు ఇస్తానని ప్రకటన జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఒక కోడలు తన 51 ఏళ్ల అత్తకు సంబంధించిన ఒక ప్రకటనను ఇచ్చి సంచలనంగా మారారు. తన అత్తతో కాస్తంత సమయం గడిపి.. ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఒక బాయ్ ఫ్రెండ్ అద్దెకు కావాలని క్రెయిగ్స్ లిస్ట్ అనే క్లాసిఫైడ్స్ వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చింది ఒక కోడలు. ఎవరు పడితే వారు ఈ అద్దె బాయ్ ఫ్రెండ్ డీల్ కు ఓకే కాదంటూ కొన్ని షరతుల్ని కూడా విధించారు. తన అత్తకు బాయ్ ఫ్రెండ్ గా అద్దెకు వచ్చే వ్యక్తికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు బాగా డాన్స్ కూడా వచ్చి ఉండాలన్న షరతును పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రకటన వైరల్ గా మారి.. ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఈ ప్రకటనలో మరో కీలక అంశం కూడా ఉంది. అదేమంటే.. తన అత్తకు బాయ్ ఫ్రెండ్ గా వ్యవహరించే వ్యక్తికి 960 డాలర్లు.. మన రూపాయిల్లో అయితే రూ.72వేల వరకు ఇస్తామని ఆఫర్ ఇస్తోంది. ఈ ప్రకటన ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతూ.. ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.