అమిత్‌షాతో బండి, ఈటల భేటీ అందుకే
తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రహోం మంత్రి అమిత్‌షాతో భేటి కానున్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల నేఫథ్యంలో వీరి భేటి ప్రాధాన్యత సంతరించకుంది. ఈ బేటీలో తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై చర్చించనున్నారు. దీంతో పాటు హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్న తీరును అమిత్ షాకు వీరు వివరించనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటన గురించి బండి సంజయ్ మాట్లాడుతూ, అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్తున్నామని చెప్పారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.