షర్మిలపై మండిపడ్డ కాట్రగడ్డ ప్రసూన
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేతపై మండిపడ్డారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాదధ్యక్షురాలు కాట్రడగ్డ ప్రసూన. కొత్త పార్టీ అంటూ వచ్చిన షర్మిల ఇద్దరు సీఎంల ఒప్పందాల గురించి లోటస్‌పాండ్‌లో జరిగిన సమావేశాలను బయపెట్టాలని డిమాండ్ చేశారు. వంశాపారంపర్యంగా రాజకీయాలు చేయవద్దన్నారు. అన్నా ఏపీని ఏలుతుంటే… తెలంగాణలో పాగ వేయాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడి రాజకీయాల్లో కాలు పెట్టారని మండిపడ్డారు. ఏ అధికారంతో ఇక్కడి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్, షర్మిల వేరు వేరు కాదు.. ఆ ఇద్దరూ ఒక్కటేనని… కేసీఆర్‌తో కుమ్మకై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశానాకి పూర్వవైభవం త్వరలోనే వస్తుందన్నారు.