తెరాస టిక్కెట్ నాకే కాంగ్రెస్ అభ్యర్తి- ఓటుకు 5వేలు
మీరు చదివింది నిజమే. మాజీ మంత్రి ఈటల రాజీనామా చేసిన హుజురాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గతంలో అందరూ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి కౌశిక్ రెడ్డి తెరాస మద్దత్తు తెలుపుతున్నట్లు వస్తున్న వార్తలకు నిజం చేశారు ఆయన. నియోజకవర్గానికి చెందిన విజేందర్ అనే కార్యకర్తతో ఫోన్లో మాట్లాడుతూ తనకు తెరాస టిక్కెట్ ఖాయమైందని, డబ్బులు ఎంత ఖర్చు అయినా సరే యువతను టార్గెట్ చేయండి అంటూ అతనితో ఫోన్లో సంభాషించారు. ప్రతి ఒక్కరికి 5వేల చొప్పున ఇద్దాం వారు చేయి జారిపోకుండా చూడాలి, నీకు మండల అధ్యక్షుడు టచ్ ఉంటాడు అని చేసిన సంభాషణ ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారింది. ఈ విషయం తెలసుకున్న కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.