చంద్ర‌బాబుకు షాక్‌, ర‌మ‌ణ రాజీనామా

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ‌. ఈ మేరుక పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడికి లేఖ ద్వారా త‌న రాజీనామాని పంపించారు. తెలంగాణ ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ‌కావ‌ల‌నే ఉద్దేశ్యంతో పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు. అయితే గురువారం సీఎం కేసీఆర్‌ని క‌లిసిన ఆయ‌నకి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం హామీ ఇచ్చార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది.