పోలీసులనే బెదిరించిన హైదరాబాద్ మాజీ మేయర్
హైదరాబాద్ మాజీ మేయర్ మాజిద్ హుస్సెన్ విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. ఓ భూ స్థలం వివాదంలో అక్కడి వచ్చిన ఆయన తన పరిధికి మించి మాట్లాడారు. వివరాల్లోకి వెళ్తే బంజారాహిల్స్‌లోని ఓ స్థల వివాదంలో మాట్లాడడానికి వచ్చిన అతను పోలీసులనే బెదిరించాడు. ప్రభుత్వ ఉద్యోగులు అని చూడకుండా ఇక్కడ రాయలేని భాషలో పోలీసులను, స్థల వివాదంలో ఉన్న అతన్ని బండ బూతులు తిట్టారు. అయితే మాజీ మేయర్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.