ఎన్నిక‌ల వెబ్‌కాస్టింగ్‌కు ఆహ్వానం


లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల‌కు ఏప్రిల్ 11వ‌ తేదీన జ‌రిగే పోలింగ్‌ను లైవ్‌వెబ్ కాస్టింగ్ చేయ‌డానికి ఆస‌క్తి ఉన్న‌వారు త‌మ పేర్ల‌ను https://bit.lywebcat-2019 అనే వెబ్‌సైట్ ద్వారా గాని మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా గాని న‌మోదు చేసుకోవాల‌ని జీహెచ్ఎంసీ ఐటి విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్ తెలిపారు. ఈ వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొన‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రిచే అభ్య‌ర్థులు ముఖ్యంగా సీనియ‌ర్‌ ఇంజ‌నీరింగ్ విద్యార్థులు జీహెచ్ఎంసీలో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌ని తెలిపారు. సొంత ల్యాప్‌టాప్‌ క‌లిగిన అభ్య‌ర్థులు electionswebcasting2019@gmail.comఅనే మెయిల్‌కు సంప్ర‌దించాల‌ని కోరారు. ఎన్నిక‌ల వెబ్‌కాస్టింగ్ విధుల్లో పాల్గొనే వారికి త‌గు పారితోషికం ఇవ్వ‌డంతో పాటు స‌ర్టిఫికేట్ జారీచేయ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.