విడాకులు తీసుకున్న హీరో

బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌, ఫిల్మ్‌ మేకర్‌ కిరణ్‌ రావు విడాకులు తీసుకున్నారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు శనివారం ప్రకటించారు.‘కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం.భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లలకు తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం’అని ప్రకటించారు. కాగా, 2005లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే తామిద్దరం విడిపోయినా కూడా తమ సంతానమైన ఆజాద్‌ను కలిసే పెంచుతామని అన్నారు.
ఈ పదిహేనేళ్ల ప్రయాణంలోనే మేం జీవితాన్ని మొత్తంగా అనుభవించాం. కలిసి సంతోషాలు పంచుకున్నాం.. సరదాగా నవ్వుకున్నాం.. నమ్మకంతో మా సంబంధం అలా పెరుగుతూనే వచ్చింది. ఒకరిపై ఒకరికి గౌరవం ప్రేమ ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం మా జీవితంలో సరికొత్త ఆరంభాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ మా కుమారుడు ఆజాద్‌కు తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం. సినమాలు, పానీ పౌండేషన్‌, ఇతర ప్రాజెక్టుల విషయంలో ఎప్పటిలాగే కలిసి ముందుకు సాగుతాం. మా రిలేషన్‌ను అర్థం చేసుకుని మద్దతిస్తున్న మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. వారే లేకుండా మేం ఈ నిర్ణయాన్ని తీసుకోలేకపోయే వాళ్లం. మా శ్రేయోభిలాషులందరికీ ఒకటే చెబుతన్నాం.. ఈ విడాకులు అంతం కాదు.. కొత్త జీవితానికి ఆరంభంలా చూడండి’అని అమీర్‌, కిరణ్‌ రావులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా, అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావులది ప్రేమ వివాహం. మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత 2005లో కిరణ్‌ రావును పెళ్లి చేసకున్నాడు. ఆమీర్‌ హీరోగా నటించిన ‘లగాన్‌’ సినిమాకి కిరణ్‌రావు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2011లో ఆజాద్‌ రావు ఖాన్‌ అనే బాబుకి సరోగసి పద్ధతిలో ఈ దంపతులు జన్మనిచ్చారు.