కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుయ్యేవరకు పోరాడుతా : రేవంత్ రెడ్డి
తమ పార్టీలో గెలిచి వేరేపార్టీలో చేరిన వారి సభ్యత్వం రద్దు చేసే వరకు పోరాడుతానని అన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. వారికి దమ్ముంటే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి ఎన్నికల బరిలో నిలవాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కి ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.