ఈఎన్‌టీ స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహన పెరుగుతోంది‍

  • ప్రాశాంత‌త‌, నిశబ్దంతో రోగుల ఊర‌ట‌
  • కిమ్స్ ఈఎన్‌టీ డాక్ట‌ర్ నీతు మోడ్గిల్‌

హాస్పిట‌ల్ అన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది రోద‌న‌లు, బరువెక్కిన బాధ‌తో త‌ల్ల‌డిల్లే ఆప్తుల హృద‌యాలు. కానీ కిమ్స్ హాస్పిట‌ల్ మాత్రం వారికి ఆప్యాయంగా స్వాగ‌తం ప‌ల‌కి వ్యాధుల‌ను దూరం చేస్తూ… సాంత్వ‌న చేకురుస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే… ఈఎన్‌టీ సంబంధిత రోగులు ధ్వ‌నుల శ‌బ్దంతో ఇబ్బంది ప‌డుతుంటారు. అయితే కిమ్స్ హాస్పిట‌ల్ విభాగంలోని ఈఎన్‌టీ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ నీతు మోడ్గిల్ ఓపీ గ‌దిలోకి వెళ్తే మాత్రం స‌గం వ్యాధి అక్క‌డ చూసిన వాత‌వారణానికే న‌యం అవుతుంది. రోగుల‌కు వైద్యంతో పాటు చ‌క్క‌టి అహ్లాద‌క‌ర వాత‌ర‌వార‌ణం ఇవ్వ‌డంతో రోగులు త్వ‌ర‌గా కోలుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు డాక్ట‌ర్. నీతు మోడ్గిల్‌. ఈఎన్‌టీ సంబంధిత వ్యాధులు గురించి పెరుగుతున్న అవ‌గాహ‌నపై డాక్ట‌ర్ చెప్పిన వివ‌రాలు మీకోసం.

“ఈఎన్‌టీకి సంబ‌ధించిన వ్యాధుల‌పై గ‌తంలోప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న చాలా త‌క్కువ ఉండేది. కోవిడ్ త‌రువాత చాలా మందిలో వినికిడి, గొంతు మ‌రియు ముక్కుకి వ‌చ్చే స‌మ‌స్య‌ల‌పై పెరుగుతోంది. ఈ మ‌ధ్య‌కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెర‌గ‌డం వ‌ల్ల అనేక మంది వినికిడి స‌మ‌స్య‌లతో వ‌స్తున్నారు. అంతేకాకుండి చిన్న‌పిల్ల‌లో కూడా ఈ స‌మ‌స్య‌త అంత‌కంత‌కు పెరుగుతోంది.

ప్ర‌ధానంగా ఇంట్లో ఉండే చిన్నారుల అల్ల‌రి అదుపుచేయ‌డానికి త‌ల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్‌లు ఇచ్చి వారి మానాన వదిలేస్తున్నారు. దీంతో కంటి చూపు, వినికిడి స‌మ‌స్య‌లు అధిక‌మ‌వుతున్నాయి. మాన‌వ శరీరంలో చెవులు అతి సున్నిత‌మైన‌వి. వాటిని ఎంత జాగ్ర‌త్త‌గా చూసుకుంటే అంత ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతాం. చిన్నారుల చెవుల‌లో కర్ణభేరి (tympanic membrane) సున్నితంగా ఉంటుంది. దీనిలో రెండు బహిస్త్వచాలు, మధ్య సంయోజక కణజాలం ఉంటుంది. బయటినుండి వచ్చే శబ్ద తరంగాలు కర్ణభేరిని తాకుతాయి. అక్కడి నుండి మధ్య చెవిలోని కర్ణాస్థులు లోపలి చెవిలోకి చేరవేస్తాయి. అంటే ధ్వని వల్ల గాలిలో కలిగే తరంగాలను చెవిలోపల ఉండే ద్రవంలోకి పంపుతుంది.

కర్ణభేరి పగలడం వలన బయటి శబ్దాలు చెవి లోపలికి ప్రసరింపక చెవుడు వస్తుంది. బాంబులు పేలే సమయాల్లో, అధిక ధ్వ‌ని వ‌చ్చిన‌ప్పుడు, లేక గాలిలో ప్రయాణించేటపుడు, మనం పీల్చేగాలి మధ్య చెవిలో గాలి పీడనం రెండూ సమతూకంలో లేనపుడు అనుకోకుండా కర్ణభేరి పగలవచ్చు. ఇంకా ఆటలు ఆడేటప్పుడు, ఈత కొట్టేటపుడు, తెలిసీ తెలియకుండా నీళ్ళలోకి దూకినప్పుడు కూడా ఈ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది.

కోవిడ్ వ‌చ్చిన త‌రువాత చాలా మంది ఉద్యోగస్తులు ఇంటి నుండి ప‌నులు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు. వీరు నిరంత‌రం చెవుల‌కు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఉద్యోగాలు చేస్తుంటారు. ఇటీవ‌ల కాలంలో మా ద‌గ్గరికి అనేక మంది ఐటీ ఉద్యోగులు రావ‌డం జ‌రిగింది. వారిలో ఎక్కువ‌గా వినికిడి స‌మ‌స్య‌లు, చెవులు నొప్పిగా ఉన్నాయ‌ని కార‌ణాలు చెబుతున్నారు. వీరు ఎక్కువ‌గా లాప్‌టాప్స్ ఉప‌యోగించి సినిమాలు, ఇత‌ర‌త్రా వీడియోలు చూడ‌డం, ఉద్యోగ‌రీత్యా హెడ్‌ఫోన్స్ వాడ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ల‌ను వ‌స్తున్నాయి. డాక్ట‌ర్లు చెప్పిన స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటే ఈ స‌మ‌స్య‌ల‌కు దూరమ‌వుతాయి.

శారీరక శ్రమ తగ్గించినప్పటి నుంచి మనిషికి అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. సరైన ఆహారం కూడా తీసుకోకపోవడం దీనికి మరో కారణం. కల్తీ ఆహారం కూడా కారణమే. మీరు తీసుకునే ఆహారమే మీ ఆరోగ్యం ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది. అందుకే ఎలాంటి ఆహారాలు దేనికి మంచివి అనేవి తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న ప్రపంచంలో వాతావరణం కూడా కలుషితం అవుతోంది. కనీసం స్వచ్ఛమైన గాలి కూడా అందడం లేదు మనిషికి. అయితే గొంతు నొప్పి (Sore throat) కూడా ఒకటి సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో ఇన్ఫెక్షన్, మంట సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల జ్వరం, జలుబు. తలనొప్పి (Headache) వంటివి కూడా వస్తాయి. నిర్ల‌క్ష్యం చేయ‌కుండా డాక్ట‌ర్‌ని సంప్ర‌దించాలి.

చెవి, ముక్కు, గొంతు సమస్యలు కూడా ఒక దానికొకటి సంబంధం ఉంటుంది. ఈ సమస్యలు అన్ని కూడా రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన, మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన సమస్య తీవ్రత పెరిగి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతుంది.

  • తల తిరగటం: ఇది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో గమనిస్తూనే ఉంటాము. ముఖ్యంగా పడుకున్నప్పుడు గాని, పడుకుని చాలా తొందరగా లేచినప్పుడు, సడెన్‌గా పైకి చూసినప్పుడు వస్తుంది. ఒక్కొక్కసారి చెవిలో ఒక భాగమైన వెస్టిబ్యూల్ నరాలు ప్రేరేపితం అవటం వలన కూడా ఇది వస్తుంది.
  • మీనియర్స్ వ్యాధి: ఇది ముఖ్యంగా చెవి లోపలి పొరకు వస్తుంది. దీనిలో ముఖ్యంగా తల తిరగటం, సరిగ్గా వినిపించక పోవటం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
  • ఎకోస్టిక్ న్యూరోమా: ఇది చెవిలోపల ఒక కణితి ఏర్పడి, వినికిడి లోపం, చెవిలో హోరుమని శబ్దాలు, నడిచేటప్పుడు కూడా సరిగ్గా బ్యాలెన్స్ లేకపోవటం, మొహం అంతా తిమ్మిరి రావటం వంటి లక్షణాలు వస్తాయి. కఖఐ పరీక్ష చేయించుకుంటే కణితి సైజ్ ఎలా ఉన్నది తెలుస్తుంది.
  • ల్యాబరింథైటిస్, వెస్టిబ్యులార్ మ్యారైటిస్: చెవిలోపలి పొరకు వచ్చే వాపు వలన ఈ సమస్య వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా వలన వస్తుంది. చెవి మధ్యపొర నుంచి వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిలో కూడా ముఖ్యంగా తల తిరగటం, వికారం, వినికిడిలోపం వంటివి ఉంటాయి.
  • ఓటో స్ల్కీరోసి్‌స్, టినిటస్ లాంటి సమస్యలు: ఇవి చెవిలోపల సర్వ సాధారణంగా గమనిస్తుంటాము. ఇదేవిధంగా ముక్కు లోపల కూడా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించి, ఎలర్జీ వంటి సమస్యలు వస్తూంటాయి. అవి…
  • ఎలర్జిక్ సైనసైటిస్
  • ఎపిస్టాక్సిస్
  • సైనసైటిస్.

ఈ పైన చెప్పిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ యొక్క శక్తి క్షీణించటం వలన, సాధారణమైన జలుబు, తుమ్ములు, ముక్కు నుంచి విపరీతంగా నీరు కారటంతో మొదలయి, సరైన రీతిలో చికిత్స తీసుకోక, విపరీతమైన కఫం లేదా శ్లేష్మం గాలి రంధ్రాలలో పేరుకుపోయి, వాటికి వాపు వస్తుంది. ఈ సమస్యను సైనసైటిస్ అంటారు. దీనిలో తలబరువు, వికారం, వాంతులు, వాసన తెలియకపోవటం, నీరసం, అలసట, ఎవరి పనులు వారు చేసుకోలేక పోవటం వంటి సమస్యలు వస్తాయి.

చెవి, ముక్కుకు వచ్చే సమస్యలు గొంతు సమస్యలకు కూడా దారి తీస్తుంటాయి. వీటిలో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి రోజురోజుకి తగ్గి మొత్తం చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఏర్పడుతుంటాయి.

  • సాధారణంగా వచ్చే గొంతు సమస్యలు:

స్వరపేటికలో వచ్చే సమస్యలు: ఇవి ముఖ్యంగా, గొంతు ఎక్కువగా వాడటం వలన అంటే ఎక్కువగా మాట్లాడే వారిలో, పాటలు పాడే వాళ్ళలో, హైపోథైరాయిడిజమ్, సైనసైటిస్‌తో ఎక్కువ కాలంగా బాధపడుతున్న, విపరీతమైన దగ్గు ఉండే వాళ్ళల్లో వస్తుంది. అరుగుదల సమస్య ఉండే వాళ్ళల్లో కూడా గొంతు దగ్గర మంట, నొప్పి, తీసుకున్న ఆహారం మింగలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’కు దారి తీస్తాయి.