రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు శుభాకాంక్ష‌లు తెలిపిన కొల్లి మాధ‌వి

భార‌త‌దేశ 15వ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు శుభాకాంక్ష‌లు తెలిపారు భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర నాయ‌కురాలు కొల్లి మాధ‌వి. ఒక్క బీజేపీ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు. ఈ దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలో ఉన్న‌న్నినాళ్లు పేదలు కలలు కనొచ్చు.. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని.. అందుకే నూత‌న రాష్ట్ర‌ప‌తే ఒక మంచి ఉదాహ‌ర‌ణ అని అన్నారు. సోమవారం(ఇవాళ) ఉదయం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ సమక్షంలో రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేశారు. తెలంగాణ మ‌హిళా లోకం నుండి కొల్లి మాధ‌వి రాష్ట్ర‌ప‌తికి శుభాకాంక్ష‌లు తెలిపారు.