తెలంగాణ సంస్కృతికి నిలువుట్ట‌దం బోనాల పండుగ – కొల్లి మాధ‌వి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆషాఢ బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. చరిత్రాత్మక హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో నేడు బోనాల జాతర నిర్వహించారు. తెల్లవారుజామున పూజల అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభమైనాయి. బోనాల్లో భాగంగా గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారికి మూడు వారాలుగా బోనాల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

ఈ ఉత్స‌వాలు తెలంగాణ సంస్కృతి సంప్రాదాయానికి నిలువుట్ట‌ద్దాల‌ని పేర్కొన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నాయ‌కురాలు కొల్లి మాధ‌వి. హిందు సంప్ర‌దాయాలతో పాటు మ‌త సామ‌ర‌స్యాల‌ను కాపాడుతున్న‌ది అన్నారు. హైదరాబాద్ అంటే బోనాలు, బోనాలు అంటే హైద‌రాబాద్ అని అన్నారు. కానీ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా తెలంగాణ పండుగ‌ల‌ను అధికార పార్టీ వారి రాజ‌కీయ ల‌బ్దికోసం వాడుకుంటుద‌ని విమ‌ర్శించారు.