న‌ష్టాల బాట‌లో హైద‌రాబాద్ స్పాలు

స్పా, వెల్‌నెస్ క్లినిక్‌ల‌కు హ‌బ్‌గా మారింది హైద‌రాబాద్ న‌గ‌రం. ఎక్క‌డ చూసిన కుప్ప‌లు, తెప్ప‌లుగా వెలుస్తున్న స్పాలు ఇప్పుడు న‌ష్టాల బాట‌లో కొన‌సాగుతున్నాయి. కోవిడ్ త‌రువాత మెల్ల‌గా పుంజుకుంటున్న త‌రుణంలో వేస‌వి కాలం, పండ‌గ సీజ‌న్‌ల‌తో వ్యాపారం లేక ఇబ్బంది ప‌డుతున్నారు. అతి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బులు సంపాదించే వ్యాపారంగా న‌గ‌రంలో గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా సాఫీగా సాగుతున్నాయి.

ఇటీవ‌ల మొద‌లైన ఐపీఎల్ కూడా స్పా రంగానికి పెద్ద దెబ్బ కొడుతోందని గ‌చ్చిబౌలికి చెందిన ఓ వ్యాపార‌స్తుడు తెలిపారు. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యాపారం భారీ న‌ష్టాల్లో ఉంద‌న్నారు. ఈ రంగానికి ముడిప‌డి ఉన్న వ్యాపారాలు కూడా తీవ్ర‌మైన ఇబ్బందుల్లో ఉంద‌ని చెబుతున్నారు.