శంషాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత

హైద‌రాబాద్ మ‌రోమారు ప్ర‌పంచ వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మ‌రోమారు భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. వివార‌ల్లోకి వెళ్తే.. సౌత్ ఆఫ్రికా ప్రయాణికురాలి వద్ద 21.90 కోట్ల‌ విలువ చేసే 3.129 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు డిఆర్ఐ అధికారులు. కస్టమ్స్ అధికారులు ఏమాత్రం అనుమానం రాకుండా తెల్లటి పౌడర్ కలిగిన హెరాయిన్ ను రెండు తెల్లటి కవర్స్ లో చుట్టి ట్రాలీ బ్యాగ్ కింది‌ భాగంలో దాచింది ఆ ప్ర‌యాణికురాలు.

విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిఘా పెట్టారు. నైరోబీ నుండి దోహా మీదుగా హైదరాబాదు వచ్చిన లేడి కిలాడి వ్యవహార శైలి లో అనుమానం కలగడంతో ప్రశ్నించారు డిఆర్ఐ బృందం. దీంతో ట్రాలీ బ్యాగ్ కింది భాగం లో దాచిన హెరాయిన్ గుట్టును రట్టు చేసిన అధికారులు. లేడి కిలాడి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.