సిక్స‌ర్‌తో సెంచ‌రీ చేసిన బ‌ట్ల‌ర్‌

గ్రౌండ్‌లోకి దిగిన మొద‌లు బ్యాట్‌కి ప‌ని చెప్పాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట్స్‌మెన్ బ‌ట్ల‌ర్‌. బౌల‌ర్ ఎవ‌రూ అనేది చూడ‌లేదు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయి బంతిని ఓ ఆట‌డేశాడు. దీంతో కోల్‌క‌త‌కి భారీ ల‌క్ష్యన్ని ముందుచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బట్లర్ 61 బంతుల్లో 103 పరుగులు చేశాడు. బట్లర్ ఓ భారీ సిక్స్ తో సెంచరీ మార్కు అందుకోవడం విశేషం.

బట్లర్ స్కోరులో 9 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. బట్లర్ క్రీజులో ఉన్నంత సేపు ఏ దశలో రన్ రేట్ 10కి తగ్గలేదు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (24), కెప్టెన్ సంజు శాంసన్ (38)లతో బట్లర్ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

చివర్లో షిమ్రోన్ హెట్మెయర్ (13 బంతుల్లో 26 నాటౌట్) ధాటిగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 200 మార్కు దాటింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా, పాట్ కమిన్స్ 1, ఆండ్రీ రస్సెల్ 1, శివం మావి 1 వికెట్ తీశారు.