ఖాతా తెరిచిన హైదరాబాద్‌

ఎట్ట‌కేల‌కు ఐపీఎల్‌లో త‌న మొద‌టి విజ‌యం సాధించి ఖాతా తెరిచింది. మొద‌ట బ్యాటింగ్ దిగిన చైన్నైని త‌క్కువ ప‌రుగుల‌కే క‌ట్టిడి చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన హైద‌రాబాద్ ఆట‌గాళ్లు నిల‌క‌డగా ఆడి ప‌రుగులు పెట్టించారు. మ‌రో రెండు ఓవ‌ర్లు పైగా ఉండ‌గానే విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. అసలు ఆడుతుంది డిపెండింగ్‌ చాంపియనేనా కాదా అనేలా సీఎస్‌కే ఆటతీరు రోజురోజుకు మరింత దిగజారుతుంది. గతంలో సీఎస్‌కే 150పై చిలుకు స్కోర్లు చేసిన సందర్భాల్లో చాలా తక్కువగా ఓడింది. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కే ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం సీఎస్‌కేకే ఇది రెండోసారి.