ప్రారంభ‌మైన దీప్‌మేళా

  • ముఖ్యఅతిథిగా క‌రుణ గోపాల్‌
  • మూడు రోజుల పాటు హైటెక్స్‌లో సంద‌డి


హైటెక్స్‌లో దీప్‌మేళా సంద‌డి మొద‌లైంది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా దీపిక్షా మ‌హిళా క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఈ మేళాకు హైద‌రాబాద్ ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంది. ఈ సంవ‌త్స‌రం కూడా కోల‌హ‌లంగా ముస్తాబైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫౌండేష‌న్ ఆఫ్ ప్యూట‌రిస్టిక్ సిటిస్ ప్రెసిడెంట్
క‌రుణ గోపాల్ మేళాను ప్రారంభించారు.

ఈ క్ల‌బ్ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా అనాధాల‌కు అండ‌గా నిలిస్తోంది. క‌న్య గురుక‌ల పాఠ‌శాల‌ను ద‌త్త‌త తీసుకుంది. ఈ పాఠ‌శాల నిర్వ‌హ‌ణ మొత్తం ఈ క్ల‌బ్ స‌భ్యులు నిర్వ‌హిస్తున్నారు. ఇందు కోసం ప్ర‌తి యేటా దీప్ మేళా ఎగ్జిబిష‌న్ నిర్వ‌హిస్తారు. ఈ మేళాలో వ‌చ్చిన నిధుల‌ను ద‌త్త‌త పాఠ‌శాల కోసం ఖ‌ర్చు చేస్తారు. అలాగే ఈ సారి కూడా హైటెక్స్‌లో రెండు రోజుల పాటు అంటే ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వ‌ర‌కు దీప్ మేళా ఎగ్జిబిష‌న్ జ‌రగ‌నుంది.

ఈ మేళాలో గృహిణుల‌ను ప్రోత్స‌హించ‌డానికి వారు ఉత్పత్తి చేసిన వాటిని వారు కళాత్మక వస్తువులు, అల్లిన దుస్తులు, కుట్టిన వస్తువులు, ఎంబ్రాయిడరీ వస్తువులు లేదా పాపడ్, ఊరగాయలు, వడలు వంటి ఇంట్లో తయారు చేసిన వస్తువులను విక్రయించేలా ప్రోత్సహిస్తారు. చురాన్, మొదలైనవి ప్ర‌ద‌ర్శ‌న‌లో కొలువుదీర‌నున్నాయి. అలాగే కన్స్యూమర్ & కార్నివాల్స్ పరిశ్రమలో దుస్తులు & దుస్తులు, అద్భుతమైన బహుమతి , ఆభరణాలు మరియు ఉపకరణాలు, గృహోపకరణాలు, డెకర్ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు మరియు సౌందర్య ఉత్పత్తులు, ఆహారం & పానీయాలు, వస్త్రాలు, హ్యాండ్‌బ్యాగ్‌లు మొదలైన ఇతర ఉత్పత్తులు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో దీపిక్షా మ‌హిళా క్ల‌బ్ ప్రెసిడెంట్ రాజ్‌శ్రీ సోమాని, వైస్ ప్రెసిడెంట్ నిధి ల‌కోటియాతో పాటు క్ల‌బ్ స‌భ్యులు పాల్గొన్నారు.

దీప్ మేళా
వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కొండాపూర్, హైదరాబాద్.
తేదీ: 25 మార్చి, (శుక్రవారం) 2022 నుండి 27 మార్చి, (ఆదివారం), 2022 వరకు
సమయం: ఉద‌యం 10:00 నుండి రాత్రి 8:00 గంట‌ల‌ వరకు