కోడ‌లిపై మామ కామ కోరిక‌లు చివ‌రికి

స‌మాజం సిగ్గుతో త‌ల దించుకోవాల్సిన ప‌రిస్థితి. వావి వ‌ర‌స‌లు లేకుండా కామంతో కొట్టుమిట్టాడుతున్నాయిఇ. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోరిక తీర్చలేదని కోడలిని మామ అత్యంత పాశవికంగా హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సోమ్లాతండా. ఈ గ్రామంలో రజిత అనే మహిళకు ఇదే తండాకు చెందిన వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు.
అయితే రోజులు గడుస్తున్న కొద్ది రజిత మామ భూక్యా హచ్చా ఆమెపై కాస్త కన్నేసి నా కోరిక తీర్చాలంటూ వెంటపడేవాడు. మామ వేధింపులను తట్టుకోలేకపోయిన రజిత తన పుట్టింటి వాళ్లకు చెప్పి పంచాయితీలో అతడిని నిలదీసింది. కొంత కాలం బాగానే ఉన్నా మామ భూక్యా హచ్చా మళ్లీ మొదటి దారికొచ్చాడు. నా కోరిక తీర్చాల్సిందే అంటూ వెంటపడేవాడు. అలా ఏకంగా మూడేళ్లుగా మామ రజితను వేధింపులకు గురి చేసేవాడు.
అయితే ఇటీవల మామ ఒంటరిగా ఉన్న రజిత ఇంటికొచ్చి మళ్లీ అడుగుతున్నా.. నా కోరిక తీర్చాలని చెప్పాడు. మామ కోరికను కోడలు రజిత నిరాకరించింది. ఇక కోపంతో ఊగిపోయిన మామ హచ్చా కోడలిపై దారుణానికి పాల్పడ్డాడు. పక్కనున్న రేంజ్‌స్పానర్‌ తీసుకుని రజిత తలపై బలంగా బాదాడు. దీంతో కోడలు రజిత రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మరణించింది. నిందితుడు అటు నుంచే అటు స్థానిక పోలీసుల ఎదుట లొంగిపోయి రజితను నేనే చంపానని ఒప్పుకున్నాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మామ హచ్చాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.