ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్ ఆవిష్కరణ

భారతదేశపు అతి పెద్ద ప్యూర్‌ ప్లే క్రెడిట్‌ కార్డ్‌ జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డ్‌, ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్ ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల ఆరోగ్యం, క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ఫీచర్లతో ఎంతో ఆలోచనతో ఈ కార్డ్ డిజైన్‌ చేశారు. కస్టమర్లు జాయినింగ్‌ ఫీజు చెల్లించిన తర్వాత స్వాగత కానుకగా రూ.4,999 విలువ చేసే నాయిస్‌ కలర్‌ఫిట్‌ పల్స్ స్మార్ట్‌ వాచ్‌ను అందిస్తున్న మొట్టమొదటి కార్డ్‌ ఎస్‌బీఐ పల్స్‌.

ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు పెరుగుతున్న భారతీయ వినియోగదారుల పెరుగుతున్న అనుగుణంగా ఉంటుంది ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్‌ క్రెడిట్‌ కార్డ్‌. జీవనశైలిలో ఎదుగుదల, సాంకేతిక అభివృద్ధి, అంతర్జాతీయ ఎక్స్‌పోజర్‌తో పాటు ఖర్చు చేసేందుకు ఆదాయం చేతిలో ఉండటంతో చాలా మంది మెరుగైన ఆరోగ్యం, బాగోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అది వారి నిత్య జీవితంలోనూ ప్రతిబింబిస్తోంది. అది ఆహారం కావచ్చు, ఫ్యాషన్‌, వినోద కార్యకలాపాలు లేదా జీవనశైలి అంశాల్లో అది కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషమేంటంటే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనే భావన వయస్సు, ప్రాంతం, ఆదాయ శ్రేణులతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. వీటిన్నింటి మధ్య ఆరోగ్యం, బాగోగులకు సంబంధించి కస్టమర్లు చేసే ఖర్చులపై ప్రత్యేక విలువ అందిస్తూ, వారి ఫిట్‌నెస్‌ ఆకాంక్షలకు చేయూత అందించడం ఎస్‌బీఐ పల్స్ కార్డ్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్డు ఆవిష్కరణ సందర్భంగా ఎస్‌బీఐ కార్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ రామ్మోహన్‌ రావు అమర మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలనే చైతన్యం బాగా పెరిగింది, ఆ భావనకు కొవిడ్‌-19 నిస్సందేహంగా తోడ్పాటు అందించింది. కస్టమర్లు జరిపే కొనుగోళ్లలో ఆరోగ్య ఉత్పత్తులు అగ్రస్థానంలో నిలుస్తున్నట్టు ఎస్‌బీఐ కార్డులో మేము గుర్తించాం. అంతే కాదు పెరుగుతున్న పట్టణీకరణ, భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న యువజనాభా, పెరుగుతున్న కొనుగోలు శక్తి కారణంగా ఈ శ్రేణిలో కొనుగోళ్ల వాటా పెరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎంతో ఆలోచించి రూపొందించిన ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్‌ను ప్రవేశపెట్టేందుకు ఇది తగిన సమయమని మేము భావిస్తున్నాం. ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌ విషయంలో పెరుగుతున్న మా కస్టమర్ల అవసరాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వారి ఆకాంక్షలకు తగినట్టుగా ఈ ప్రత్యేకమైన కార్డ్ ఉంటుంది” అన్నారు.

ఈ కార్డుతో వెల్కమ్‌ గిఫ్టుగా కస్టమర్లకు నాయిస్‌ కలర్‌ఫిట్‌ స్మార్ట్‌వాచ్‌ ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్ అందిస్తుంది. 1.4 ఇంచుల ఫుల్‌ కలర్‌ డిస్‌ప్లే, బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటరింగ్ (SPO2), స్లీప్‌ మానిటరింగ్‌ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ వాచ్‌ ఆరోగ్యకరమైన జీవితం దిశగా సాగుతున్న కస్టమర్లకు మరింత చేయూతగా నిలుస్తుంది. దీంతో పాటు ఒక సంవత్సరం ఫిట్‌పాస్‌ ప్రో సభ్యత్వాన్ని ఈ కార్డు అందిస్తుంది. భారతదేశవ్యాప్తంగా ఉన్న 4000 ప్లస్‌ జిమ్స్, ఫిట్‌నెస్‌ స్టూడియోలకు దీని ద్వారా కస్టమర్లకు యాక్సెస్‌ లభిస్తుంది. యోగా, డ్యాన్స్, కార్డియో, పిలేట్ ఇంకా అనేక ఆన్‌లైన్‌ ఫిట్‌నెస్‌ సెషన్లను దీని ద్వారా పొందవచ్చు. అంతే కాదు ఈ కార్డు ద్వారా కస్టమర్లు ఒక సంవత్సరం నెట్‌మెడ్స్‌ ఫస్ట్ మెంబర్‌షిప్‌ పొందుతారు. ఒక సంవత్సరం పాటు అపరిమితమైన ఆన్‌లైన్‌ డాక్టర్‌ కన్సల్టెషన్లతో పాటు వార్షిక ప్రాథమిక హెల్త్ చెకప్‌, పాథాలజీ ల్యాబ్‌ టెస్టులపై 5% అదనపు తగ్గింపు సహ అపరిమితమైన ఉచిత, ప్రయారిటీ డెలివరీ అందుకోవచ్చు. కార్డు వార్షిక ఫీజు చెల్లించి కార్డుపై మొదటి రిటెయిల్‌ లావాదేవీ జరిపిన వెంటనే ఫిట్‌పాస్‌, నెట్‌మెడ్స్‌ సభ్యత్వం యాక్టివేట్‌ అవుతాయి.

సంపన్న శ్రేణిని లక్ష్యంగా చేసుకుని అందిస్తున్న ఈ కాంటాక్ట్‌ లెస్‌ కార్డు వార్షిక మెంబర్‌షిప్‌ ఫీజు రూ.1499 మాత్రమే. దీన్ని వీసా సిగ్నేచర్‌ ఫ్లాట్‌పామ్‌పై విడుదల చేస్తున్నారు. కార్డు సభ్యత్వ సంవత్సరంలో రూ.2 లక్షల కొనుగోళ్లు జరిపినట్టు అయితే రెన్యూవల్‌ ఫీజు మినహాయింపు లభిస్తుంది. ఫార్మసీలు, ఔషధ దుకాణాలు, డైనింగ్‌, సినిమాలపై జరిపే కొనుగోళ్లకు 5X రివార్డు పాయింట్లను కొనుగోలుదారులు పొందుతారు. అంతే కాదు కార్డు సభ్యత్వ సంవత్సరంలో రూ.4 లక్షలు ఖర్చు చేసినట్టు అయితే రూ.1500 విలువైన నెట్‌మెడ్‌ ఈ-వౌటర్‌ అందుకుంటారు.

ఆరోగ్యం, క్షేమానికి సంబంధించిన ప్రయోజనాలే కాదు, ఈ కార్డు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తోంది. ఇందులో సంవత్సరంలో 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్‌ లాంజ్‌ విజిట్స్, $99 విలువైన కాంప్లిమెంటరీ ప్రయారిటీ పాస్‌ మెంబర్‌షిప్‌, కాంప్లిమెంటరీ గ్రూప్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్, కాంప్లిమెంటరీ ఫ్రాడ్‌ లయబిలిటి కవర్‌, కాంప్లిమెంటరీ ఎయిర్‌ యాక్సిడెంట్‌ కవర్ కూడా ఉన్నాయి.