మావోయిస్టుల‌కు ఇచ్చిన క‌రోనా టీకాల‌పై అనుమానం

మావోయిస్ట‌ల‌కు ఇచ్చిన క‌రోనా టీకాల‌పై అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా ప్రభావం అడ‌వుల్లో ఉన్న వారిపై సోక‌డంతో వారు కూడా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే క‌రోనా టీకాలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రంలో ఇచ్చిన టీకాలు వారు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అనేక మంది మావోలు అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని ఇటీవ‌ల లోంగిపోయిన పోజ్జో, ల‌ఖ్కె సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. దంతెవాడ పోలీసుల‌కు లోంగిపోయిన వారు మావోల గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మావోయిస్టు అగ్రనేతలు పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. అలాగే, దాదాపు 700 మంది మావోయిస్టులు కరోనా టీకాలు వేయించుకున్నట్టు పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లో టీకాలపై అనుమానంతో ఏపీ, తెలంగాణ నుంచి టీకాలను తెప్పించుకున్నట్టు వివరించారు. టీకాలతోపాటు చికిత్సకు అవసరమైన ఔషధాలు కూడా మావోయిస్టులకు చేరాయన్నారు.

మావోయిస్టు దక్షిణ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నారని హిడ్మా, సుజాత, వికాస్, రఘుతోపాటు పలువురు మావోయిస్టు అగ్రనేతలు కొవిడ్ టీకాలు తీసుకున్నట్టు తెలిపారు. దక్షిణ బస్తర్ విభాగం ఇన్‌చార్జ్ రఘు, మాసా బెటాలియన్ కమాండర్ రాజేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, బహుశా వారికి కరోనా సోకి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వారు కర్రల సాయంతో నడుస్తున్నారని, ఆరోగ్యం కొంత విషమంగానే ఉందని తెలిపారు.